Posts

తెలుగంటే..

 *తెలుగంటే...గోంగూర* *తెలుగంటే...గోదారి* *తెలుగంటే...గొబ్బిళ్ళు* *తెలుగంటే...గోరింట* *తెలుగంటే...గుత్తోంకాయ్* *తెలుగంటే...కొత్తావకాయ్* *తెలుగంటే....పెరుగన్నం* *తెలుగంటే...ప్రేమా, జాలీ, అభిమానం* *తెలుగంటే... విజయనగర సామ్రాజ్యం* *తెలుగంటే... కాకతీయ సామ్రాజ్యం* *తెలుగంటే... పల్నాటి పౌరుషం* *తెలుగంటే...రాయల సీమ రాజసం* *తెలుగంటే... శ్రీ కృష్ణ దేవరాయలు* *తెలుగంటే...గౌతమీ పుత్ర శాతకార్ణి* *తెలుగంటే...రాణీ రుద్రమదేవి* *తెలుగంటే...రాజరాజ నరేంద్రుడు* *తెలుగంటే... తాండ్ర పాపారాయుడు* *తెలుగంటే...ముక్కుపుడక* *తెలుగంటే...పంచెకట్టు* *తెలుగంటే...ఇంటిముందు ముగ్గు* *తెలుగంటే...నుదుటిమీద బొట్టు* *తెలుగంటే...తాంబూలం* *తెలుగంటే...పోతన్న* *తెలుగంటే...అల్లసాని పెద్దన* *తెలుగంటే...తెనాలి రామకృష్ణ* *తెలుగంటే...పొట్టి శ్రీరాములు* *తెలుగంటే...అల్లూరి సీతారామరాజు* *తెలుగంటే...కందుకూరి వీరేశలింగం* *తెలుగంటే...గురజాడ* *తెలుగంటే...శ్రీ శ్రీ* *తెలుగంటే...వేమన* *తెలుగంటే...నన్నయ* *తెలుగంటే...తిక్కన* *తెలుగంటే...ఎఱ్ఱాప్రగడ* *తెలుగంటే...క్షేత్రయ్య* *తెలుగంటే...శ్రీనాధ* *తెలుగంటే...మొల్ల* *తెలుగంటే...కంచర్ల గోపన్న* *...

అరుదైన సమాచారం

 దిక్కులు : (1) తూర్పు, (2) దక్షిణం, (3) పడమర, (4) ఉత్తరం మూలలు :(1) ఆగ్నేయం, (2) నైరుతి,(3) వాయువ్యం, (4) ఈశాన్యం  వేదాలు :(1) ఋగ్వే దం,  (2) యజుర్వేదం,(3) సామవేదం, (4) అదర్వణ వేదం  పురుషార్ధాలు :(1) ధర్మ, (2) అర్థ, (3) కామ,(4) మోక్షా  పంచభూతాలు :(1) గాలి, (2) నీరు, (3) భూమి,(4) ఆకాశం,(5) అగ్ని.   పంచేంద్రియాలు : (1) కన్ను,  (2) ముక్కు, (3) చెవి, (4) నాలుక, (5) చర్మం.  లలిత కళలు : (1) కవిత్వం, (2) చిత్రలేఖనం, (3) నాట్యం, (4) సంగీతం, (5) శిల్పం.  పంచగంగలు : (1) గంగ, (2)  కృష్ణ, (3) గోదావరి, (4) కావేరి,  (5) తుంగభద్ర.  దేవతావృక్షాలు : (1) మందారం,  (2) పారిజాతం, (3) కల్పవృక్షం,  (4) సంతానం, (5) హరిచందనం.  పంచోపచారాలు : (1) స్నానం, (2) పూజ,  (3) నైవేద్యం, (4) ప్రదక్షిణం, )5) నమస్కారం.    పంచామృతాలు : (1) ఆవుపాలు, (2) పెరుగు, (3) నెయ్యి, (4) చక్కెర,  (5) తేనె.  పంచలోహాలు : (1) బంగారం,  (2) వెండి,  (3) రాగి, (4) సీసం, (5) తగరం.  పంచారామాలు : )1) అమరావతి, (2) భీమవరం, (3) పాలకొల్ల...

నాన్న.

*నాన్న ఎవరు??* బ్రహ్మదేవుడు చాలా బిజీగా తల రాతలు రాసే పనిలో ఉన్నాడు. ఇంతలో నేను, భూమి మీదకు వెళ్ళను అని మారాం చేయడం మొదలుపెట్టాను. “భూమి మీద నాకు ఎవ్వరూ తెలీదు. నేను ఎలా బతకగలను? అని అడిగాను. నువ్వేం భయపడకు. నిన్ను కాచి కాపాడటానికి నా అంశగా ఒక అమ్మను తయారుచేశాను. ఆమె కడుపులో నిన్ను పుట్టిస్తా” అన్నాడు బ్రహ్మదేవుడు. “అయితే సరే, కానీ నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఏడవటం మొదలుపెడతా. అప్పుడు మీరు నా ఇబ్బందిని తొలగించాలి” అనే షరతు పెట్టాను. దానికి బ్రహ్మా, “సరే నీకు మాటలు రానంత వరకు బ్రహ్మా విష్ణు మహేశ్వరులం ముగ్గురు నీకు సహాయం చేస్తాం” అన్నాడు. “మరి, ఆ తర్వాత చెయ్యరా?” అని అడిగా “అదేం లేదులే. నీకు మాటలోచ్చాకా నీకో మహా మంత్రం భోదిస్తాం. నీకు ఏ కష్టం వచ్చినా, ఒక్కసారి ఆ మంత్రం పఠిస్తే తప్పకుండా నీకు సహాయం దొరుకుతుంది.” అని చెప్పాడు బ్రహ్మా. మళ్ళీ ఇంకేదో అడగబోయే లోపల ఆ పరబ్రహ్మ, తన బెడ్రూం బాల్కనీ లోంచి నన్ను కిందకి త్రోసేశాడు. ఎలా వచ్చి చేరానో తెలియదు గానీ, ఆసుపత్రి బెడ్ మీద మా అమ్మ పక్కన వచ్చిపడ్డాను. అమ్మ పక్కన హాయిగా నిద్రపోతున్న నన్ను, ఓ పెద్దమనిషి తన చేతిలోకి తీసుకున్నాడు. భయమేసి, ...

భాగ్య-చోటు

అన్నం తిన్నాం. కాసేపు చల్ల గాలిలో అలా నడుద్దామని బయటకి వచ్చాను. ఏవేవో జ్ఞాపకాలు. గతం నన్ను తరుముకుంటూ నా వెనుకే వచ్చి ఆగినట్లనిపించింది. అదేంటో చల్ల గాలి మన గతాన్ని మోసుకొస్తుందేమో అనిపిస్తుంది. కన్నీళ్లు ఆనకట్టని తెంచుకుని జర జరా కిందకి కారాయి. నడక ముగించుకుని ఇంటికి చేరుకున్నాను. పాప మంచం మీద పడుకుని ఆకాశంలోకి చూస్తూ వుంది. బుజ్జి కొండ: నాన్నా! రా పడుకుందాం. నేను: ఉమ్మా! వచ్చేసా... బుజ్జి కొండ: నాన్న, కథ చెప్పు. నేను: నాకు రావమ్మా, అమ్మని అడుగు. బుజ్జి కొండ: చెప్పు నాన్న, నువ్వ అసలు చెప్పవ్. నేను: అమ్మ బాగా చెప్తుందమ్మా, అమ్మ చేత చెప్పించుకో. అంతలోనే వాళ్ళ అమ్మ వచ్చి తన పక్కన పడుకుంది. బుజ్జి కొండ: అమ్మా, నాన్నని కథ చెప్పమంటే చెప్పట్లా!!! తను: మీ నాన్న చెప్పడు, అన్నీ లోపలే దాచుకుంటాడు. బుజ్జి కొండ: నాన్నా! దాచుకోకు నాన్నా, బయటకి తీయి. నేను: హాహా! నీకు ఆడుకోడానికి తమ్ముడు కావాలన్నావా? బుజ్జి కొండ: హా! నేను: మరి కళ్ళు మూసుకుని త్వరగా పడుకో. బుజ్జి కొండ: నేను పడుకోకపోతే తమ్ముడు రాడా? నేను: ఆహా! రాడు. త్వరగా పడుకునే పిల్లల్ని చూసి వాళ్ళకే తమ్ముళ్ళని ఇస్తాడు దేవుడు. బుజ్జి కొండ: అవునా? నే...

ఆశా పాశం

Image
ఆశా పాశం బంది చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీర తీరం చేరే లోగానే ఎతీరవునో.. చేరువైన సేదు దూరాలే తోడవ్తూనే వీడే వైనాలే నీదో కాదో తెలే లోగానే ఎదేటవ్నో.. ఆటు పోటు గుండె మాటుల్లోన.. సాగేనా… ఏ లే లే లేలో.. కల్లోలం ఈ లోకంలో లో లో లోలోతుల్లో ఏ లేలో ఎద కొలనులో.. నిండు పున్నమేల మబ్బు కమ్ముకొచ్చి సిమ్మ సీకటై పోతుంటే నీ గమ్యం గంధరగోళం.. దిక్కు తోచకుండ తల్లడిల్లిపోతు పల్లటిల్లిపోయి నీవుంటే.. తీరేనా నీ ఆరాటం.. ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెల రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా ఓ..ఓ.. ఆటు పోటు గుండె మాటుల్లోన సాగేనా….. ఆశా పాశం బంది చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీర తీరం చేరే లోగానే ఎతీరవునో ఏ జాడలో ఏమున్నదో క్రీనీడల విధి వేచున్నదో.. ఏ మలుపులో ఎం దాగున్నదో నీవు గ తేల్చుకో..నీ శైలిలో.. చిక్కు ముళ్ళు గప్పి రంగు లీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం.. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్క దారి పట్టి పోతుంటే కంచికి నీ కథలే దూరం… ...

ప్రియతమా... ప్రియతమా...

Image
ప్రియతమా. ప్రియతమా. పలికినది హృదయమే సరిగమా. చిలిపి నీ తలపులో తెలిసినది వలపులో మధురిమా. చెలి చూపు తాకినా. ఉలకవా పలకవా. వలవేసి వేచి చూస్తున్నా. దొరకనే దొరకవా ఇష్టమైన సఖుడా. ఇష్టమైన సఖుడా. ఒక్కసారి చూడరా. పిల్లడా చక్కనైన. చుక్కరా చక్కనైనచుక్కరా. నిన్నుకోరు కుందిరా సుందరా. ప్రియతమా. ప్రియతమా. పలికినది హృదయమే సరిగమా. చిలిపి నీ తలపులో తెలిసినది వలపులో మధురిమా. నీ ప్రేమలో ఆరాధనై. నీ నిండుగా మునిగాకా నీ కోసమే. రాశానుగా నా కళ్లతో ప్రియలేఖ చేరునో. చేరదో తెలియదు ఆ కానుక. ఆశనే వీడకా. వెనుక పడెను మనసు పడిన మనసే ఇష్టమైన సఖుడా. ఇష్టమైన సఖుడా. ఒక్కసారి చూడరా. పిల్లడా ఉన్నానిలా. ఉంటానిలా నీ నీడగా కడదాకా కన్నీటిలో కార్తీకపు దీపాన్నిరా నువులేక దూరమే భారమై. కదలదు నా జీవితం నీవు నా చేరువై. నిలిచి మసలు మధుర క్షణములెపుడో. ‘ప్రియతమా. ప్రియతమా. పలికినది హృదయమే సరిగమా. చిలిపి నీ తలపులో తెలిసినది వలపులో మధురిమా. చెలి చూపు తాకినా. ఉలకవా పలకవా. వలవేసి వేచి చూస్తున్నా. దొరకనే దొరకవా ఇష్టమైన సఖుడా. ఇష్టమైన సఖుడా. ఒక్కసారి చూడరా. పిల్ల...

తెలుగు సామెతలు

Image
తెలుగు భాష వాడుకలో కొన్ని వందల సామెతలు పుట్టినవి. ఏ కాలంలో అంటే ఆటో పంచులు వచ్చి ఇలా వుంది కానీ ఆ కాలంలో పెద్దలు సామెతలతో ఆటాడుకునేవారు.  మీకు తెలిసినవి, లేదా ఇంకా తెలుసుకోవాలంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా పొందగలరు. చదివి  ఆనందించండి. click here to download