Posts

Showing posts from November, 2018

నా కళల రాకుమారికి_3

Image
 ప్రాణేశ్వరీ... మన వివాహ సమయమున నా మనసులోని మాట నీకు చెప్పాలనిపించింది. నీ మేనికి సొగసులద్దు ఆ పసుపు ను ఏ చేతులు దంచునో కదా!!! నీ నుదుటన కొలువుండు ఆ కుంకుమ, ఏ పువ్వు ఇచ్చునో కదా!!! నీ కళ్ళకు అంటుకొను ఆ కాటుక కు ఎంత అదృష్టమో కదా!!!   నీ ముక్కును అంటుకొని ముంగెరా అందం పెరుగుతుంది కదా!!! నీ కాలికి పారాణి గా మారిన ఆ కస్తూరి ఏ జన్మ లో పుణ్యం చేసుకుందో కదా!!! నీ చేతులకు కొత్త రంగుని ఇచ్చే ఆ గోరింట ని పెంచే చేతులు, కోసే చేతులు, రుబ్బే చేతులు పుణ్యం చేసుకుంటాయి కదా!!! నీ వాలు జడలో కొలువుదీరిన ఆ పుష్పములు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాయో కదా!!! నీ మేని పరిమళమున ఆ గంధం ఏమాత్రం నిలువును!!! నీ చేతి స్పర్శ సోకి ఆ కొబ్బరి బొండం లో నీరు అమృతం కాకుండా ఉండగలదా!!! నీ నుదుటన బాసికం ఏ చేతులు కట్టేనో కదా!!! నీ మెడలో మాంగళ్యం గా నిలిచే ఆ బంగారాన్ని తయారు చేసిన చేతులను ఎలా మర్చిపోతాను!!! నీ మేనికి అంటి చుట్టుకునే ఆ పట్టు చీర గురించి ఎంత చెప్పినా తక...

అందుకే దేశభాషలందు తెలుగు లెస్స!

Image
*స్త్రీ అను పదమునకు 220 పర్యాయ పదములివి. దాదాపుగా ఒక పదమునకు ఇన్ని పర్యాయ పదములు గల ఘనత మరే భాషలో ఉండవేమో ...!!!* 1. అంగన 2. అంచయాన 3. అంబుజాలోచన 4. అంబుజవదన 5. అంబుజాక్షి 6. అంబుజనయన 7. అంబురుహాక్షి 8. అక్క 9. అతివ 10. అన్ను 11. అన్నువ 12. అన్నువు 13. అబల 14. అబ్జనయన 15. అబ్జముఖి 16. అలరుబోడి 17. అలివేణి 18. అవ్వ 19. ఆటది 20. ఆడది 21. ఆడగూతూరు 22. ఆడుబుట్టువు 23. ఇంచుబోడి 24. ఇంతి 25. ఇదీవరాక్షి 26. ఇందునిభాష్య 27. ఇందుముఖి 28. ఇందువదన 29. ఇగురాకుబోణి 30. ఇగురాకుబోడి 31. ఇభయాన 32. ఉగ్మలి 33. ఉజ్జ్వలాంగి 34. ఉవిధ 35. ఎలతీగబోడి 36. ఎలనాగ 37. ఏతుల 38. కంజముఖి 39. కంబుకంఠ 40. కంబుగ్రీవ 41. కనకాంగి 42. కన్నులకలికి 43. కప్పురగంధి 44. కమలాక్షి 45. కరబోరువు 46. కర్పూరగంది 47. కలకంఠి 48. కలశస్తిని 49. కలికి 50. కలువకంటి 51. కళింగ 52. కాంత 53. కించిద్విలగ్న ...