నా కళల రాకుమారికి_3
నీ మేనికి సొగసులద్దు ఆ పసుపు ను ఏ చేతులు దంచునో కదా!!!
నీ కళ్ళకు అంటుకొను ఆ కాటుక కు ఎంత అదృష్టమో కదా!!!
నీ కాలికి పారాణి గా మారిన ఆ కస్తూరి ఏ జన్మ లో పుణ్యం చేసుకుందో కదా!!!
నీ చేతులకు కొత్త రంగుని ఇచ్చే ఆ గోరింట ని పెంచే చేతులు, కోసే చేతులు, రుబ్బే చేతులు పుణ్యం చేసుకుంటాయి కదా!!!
నీ వాలు జడలో కొలువుదీరిన ఆ పుష్పములు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాయో కదా!!!
నీ మేని పరిమళమున ఆ గంధం ఏమాత్రం నిలువును!!!
నీ నుదుటన బాసికం ఏ చేతులు కట్టేనో కదా!!!
నీ మేనికి అంటి చుట్టుకునే ఆ పట్టు చీర గురించి ఎంత చెప్పినా తక్కువే,
పట్టు ఇచ్చిన పట్టు పురుగుల దగ్గర నుంచి నేసిన చేనేత చేతులు వరకు అందరికి నా పాదాభివందనాలు.
కాలి వెలికి తొడిగిన మెట్టే సాక్షిగా నేను నీకు బానిసను, నువ్వు నా దేవత వి.
మెడలో కట్టిన మాంగళ్యం సాక్షిగా తుది శ్వాస వరకూ నీతోనే వుంటా.
నీ మెడలో మూడు ముళ్ళు వేస్తూ నిన్ను అంత దగ్గరగా చూస్తుంటే... అలానే చూస్తుండిపోవాలనిపించింది.
నీతో కలిసి అగ్ని సాక్షిగా ఏడు అడుగులు వేయిస్తుంటే, నాకైతే అలానే నీ వేలు పట్టుకుని ప్రపంచాన్ని చుట్టేయాలనిపించింది.
నీ చెవి ఝంకా కంటే నువ్వు నవ్వినప్పుడు నీ బుగ్గన సోట్టే చూడముచ్చటగా వుంది.
నీ వడ్డాణం కంటే ఆ నడుమున మడతే అందంగా అనిపించింది.
నీ మెడలోని హారం కంటే ఆ మెడ వంపే చాలా బావుంది.
నా ముద్దులని నువ్వు నీటి చుక్కలతో కొలిస్తే, ఒక మహా సముద్రాన్ని సృష్టించగలను.
















Comments
Post a Comment