12-February-1995



ఉత్తరాయణ, శిశిర ఋతువు, మాఘ మాసమున 
(సాక్షాత్ పరమ శివుడు జన్మించిన మాసమున)

రవి వారనా...

శుక్లపక్షం త్రయోదశి  తిధి లో...

ఆరుద్ర  నక్షత్రంలో...

ప్రీతి యోగమున...

మిధున రాశిలో...

సూర్య, చంద్ర, రాహు, శని, కేతు, బుధ గ్రహాల సమక్షంలో...

భారత మహాసముద్రము నుంచి బంగాళా ఖాతం మీదుగా వాయువు సమీపిస్తుండగా....

అగ్ని ఆదిత్యునిలో చేరి ఎదురుచూస్తూ వుండగా...

భుదేవి ఆరాట పడుతుండగా...

ఆకాశం కళ్ళు పెద్దవి చేసుకుని ఉరుమి చూస్తుండగా...

పశు పక్షి జంతు ప్రాణులు జరగబోయే మహత్కార్యాన్ని ముందుగానే ఊహించించి ఆనందంతో తాండవం ఆడుతుండగా...

చుక్కలన్నీ దిష్టి తీయడానికి సిద్దం అవ్వగా...


పార్వతి దేవి కి సరితూగగల  శక్తి ని...

సరస్వతీ దేవి కి మించిన యుక్తి ని...

పద్మావతి దేవి కి అసూయ కలిగించేంత సౌందర్యాన్ని మూడున్నర కిలో గ్రాముల బరువు కలిగిన మాంసపు ముద్ద ఆకారంలో బ్రహ్మ సృష్టించగా....

విష్ణు మూర్తి చేతి స్పర్సతో చక్కనైన ఆకారం కూడినట్టి ఆ సుగుణాల రాశికి శంకరుడు ప్రాణం పోసి కిందకి తెసుకువచ్చాడు.

మలి కాన్పుకు సిద్దమైన, పూర్వ జన్మమున అపారమైన పుణ్యం మూట గట్టుకున్న, ఒక ధీశాలి గర్భంలో ప్రవేశింప చేసాడు.

దేవతలంత ఆశిర్వదించడానికి పోటీ పడుతుండగా...

పద్మ శ్రీ గర్భమును చీల్చుకుని బయటోచ్చింది ఆ పడతి.

నేరేడు పండు లాంటి కళ్ళు...

కలువ పువ్వు లాంటి మోము...

శిక్షించడం, క్షమించడం రెండూ తెలిసిన చేతులు...

శ్రీ కృష్ణుడి పాదాలు తో అణువణువునా దైవత్వం ఉట్టిపడుతోంది ఆ పాపలో.

డాక్టర్: దేవ లోకంలో పుట్టబోయి పొరపాటున భూలోకానికి వచ్చినట్టుంది.

నర్స్: నాకైతే దేవత ని చూస్తున్నట్టే వుంది.

శివుడు: రూపం, గుణం లో తల్లి లా.. నేర్పు, నడవడిక లో నాన్న లా... శత సంవత్సరములు వర్దిల్లు గాక.

దేవతలు: తధాస్తు.

ఆ చిన్నారి పేరు ను భూలోక పండిత శ్రేష్ఠులు హారిక భవాని గా వేద  మంత్రాల సాక్షిగా నామ కరణం చేసారు.

హారిక కి కన్న తల్లిగా పద్మ శ్రీ కి దక్కిన పుణ్యం మరే మానవ స్త్రీ కి దక్కలేదంటే అతిశయోక్తి కాదు. స్వయంగా దేవత కే అమ్మ అవ్వడం ఎంత మందికి దక్కే అదృష్టం.

తల్లి పాల తోనే తన సులక్షణా లాన్నింటిని వంట పట్టించుకుంది హారిక.

కోయిల కంటే కమ్మనైన గొంతు, గానం ...

చిలుక కంటే ముద్దుగా పలికే మాటలు...

నెమలిని మరిపించే నడక, నాట్యం

అన్నింటిని చూస్తూ మురిసిపోతూ, కంటికి రెప్పలా కాచే ఆ ఉద్యోగo పద్మ శ్రీ ని వరించింది.

హారిక ని వర్ణించాలంటే నాలుగు వేదాలు చదివిన పండితులు కావాలి, లేదా అమితమైన సాహిత్య సంపన్నుడు అయ్యి ఉండాలి., లేదా ఒక కొత్త బాష ను సృష్టించగాలగాలి. అవి ఏవి నాకు చేత కాదు.. కనుకనే సీతారామ శాస్త్రి గారు వాడిన పదాలను తెసుకుంటున్నాను.

అధరం మధురం

వదనం మధురం

నయనం మధురం

హసితం మధురం

హృదయం మధురం

గమనం మధురం

వచనం మధురం

చరితం మధురం

బ్రమితం మధురం

వసనం మధురం

వలితం మధురం

ఎన్నో మధురానుభూతులను నింపుకున్న ఆ బాల్యం ని మనకి చెప్పగలిగే వ్యక్తీ ఒకరే వున్నారు.

అది త్రేతా యుగం కాబట్టి రామ కథను లవ కుశ లు చెప్పారు.
కానీ ఇది కలి యుగం. ఈ కథ చెప్పడానికి మనకి పద్మ శ్రీ మాత్రమే వున్నారు. ఆ రోజు త్వరలోనే రావాలని ఆశిద్దాం.


Comments

Popular posts from this blog

తెలుగు సామెతలు

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక అద్భుతమైన లేఖ ఇది.