Posts

Showing posts from February, 2020

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక అద్భుతమైన లేఖ ఇది.

Image
తన కుమారుణ్ణి స్కూల్లో చేర్చుతూ  ఒకనాటి అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ టీచర్ కి రాసిన లేఖ. ఇది ప్రతి తల్లికి, తండ్రికి, టీచర్ కు, విద్యార్ధికి చేరాల్సిన లేఖ. " మా అబ్బాయి ఇవాళే మొదటిసారి స్కూలుకి వస్తున్నాడు.కొంతకాలం అక్కడ అంతా వాడికి వింతగానూ కొత్తగానూ ఉండబోతోంది. అందుకే వాడితో మీరు కొంచెం సున్నితంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాను.  ఈ సాహసకృత్యం వాణ్ణి సప్తసముద్రాలూ దాటి వెళ్ళేందుకు సాయపడవచ్చు. ఆ సాహసాల్లో యుద్ధాలూ, విషాదాలూ, దుఃఖాలూ వాడికి అనుభవంలోకిరావచ్చు.అలాంటి జీవితంలో వాడికి నమ్మకం, ప్రేమ, ధైర్యం తోడుగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుచేత, దయచేసి మీరు దగ్గరుండి ప్రేమతో వాడు నేర్చుకోవలసినవన్నీ నేర్పిస్తారా? వీలైతే అవన్నీ సున్నితంగా నేర్పగలరా?  1.ఒక మిత్రుడుంటే ఒక శత్రువు కూడా ఉంటాడని నేర్పండి. అందరు మనుషులూ న్యాయంగా ఉండరనీ, అందరూ సత్యసంధులు కారనీ వాడికి తెలియాలి. 2.ఒక దుష్టుడున్న చోట ఒక వీరుడు కూడా ఉంటాడనీ  జిత్తులమారి రాజకీయ నేత ఉండే చోటే అంకితభావంతో పనిచేసే నేత కూడా ఉంటాడనీ చెప్పండి. 3.అప్పనంగా దొరికిన ₹100 కన్నా సొంతంగా సంపాదించుకున్...

నా చిట్టి తల్లికి

దేవుడికి ఒకసారి నా మీద చాలా కోపం వచ్చింది. అపుడు నన్ను బలవంతంగా భాగ్య శ్రీ జీవితం లోకి నెట్టాడు. కొంతకాలానికి అదే దేవుడికి నా మీద జాలి కలిగింది. అప్పుడు మీ ఝాన్సీ అత్తని తీసుకొచ్చి నా ఏడుపుని దూరం చేసాడు. చిట్టి తల్లి: అవునా!! అసలేమైంది? మోసం అనే రాజ్యంలో, బాధ అనే సంకెళ్లతో నన్ను కట్టేసింది భాగ్య శ్రీ. అప్పుడు ఝాన్సీ అత్త బాహుబలిలా వచ్చి ఆ సంకెళ్లు తెంచేసి, నన్ను అక్కడి నుండి విడిపించింది అమ్మా. చిట్టి తల్లి: మరి హారిక గారు??? మనం స్ఫూర్తి పొందిన వ్యక్తుల పట్ల కృతజ్ఞతతో ఉండాలే తప్ప, వారితో స్నేహాన్ని, వారి జీవితంలో స్థానాన్ని కోరుకోకూడదు, ఆశ పడకూడదు.