సంక్రాంతి కథ-1




సంక్రాంతి సెలవలకి ఇద్దరు కూతుర్లు, అల్లుళ్ళు, మనవరాళ్లు ఇంటికి రావడంతో ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే గిరిధర్ ఇల్లు కోలాహలంగా మారిపోయింది. వరండాలో మనవరాళ్లు ఇద్దరూ ఆడుకుంటున్నారు. హాల్ లో అల్లుళ్ళు కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. వంట గదిలో చెమట్లు కక్కుతున్న అమ్మ కి తోడుగా వున్నారు హర్షిత, హారిక. వంటగదిలోకి నెమ్మదిగా వచ్చాడు గిరి. పద్మ చెవిలో నెమ్మదిగా "అల్లుళ్ళకి నచ్చేలాగా చెయ్" అని చెప్పాడు. "సరే ఎన్ని సార్లు చెప్తారు" అంది చిన్న చిరునవ్వుతో.

గిరి: నీ చిన్న కూతురు లాగా నిన్న చెప్పింది నిన్నే మర్చిపోయావేమో అని.

పద్మ: అది వినిందంటే ఇంకేం లే.

గిరి: సరే, నేను బయట పిల్లలతో ఉంటా. ఏమైనా కావాలంటే పిలువు.పద్మ: అలాగే, ఉండి ఎం చేస్తావ్! ఆడుకో నువ్వు కూడా.గిరి: వాళ్ళు చెస్ ఆడుతున్నారే, నాకు రాదు కదా!

నవ్వుకుంటూ బయటకి వెళ్ళాడు గిరి.

హారిక: మా! మా ఆయనకి ముక్కలు బాగా ఉండాలి పప్పుచారులో. దోసకాయ అసలు తినరు. వంకాయ, క్యారెట్, బెండకాయ, మునక్కాయలు బాగా తింటారు.

పద్మ: సరే, బానే వేసానులే.హర్షిత: మా వారికీ అంతే కాకపోతే చింతపండు కొంచెం తక్కువ ఉండాలి. 

పద్మ: హ! తక్కువ గానే వేసానులే. 
హారిక: 
సాంబార్ పొడి ఏది వేసావ్? mtr ఆ? దివ్య నా?

ద్మ: mtr ఏలే.

హర్షిత: అన్నం బాగా మెత్తగా ఉడికించు
. 

పద్మ: సరే, ఎంత మెత్తగా కావాలో నువ్వే ఉడికించుకో.

హారిక: అయితే మా ఆయనకీ వేరే దానిలో కొంచెం రైస్ పెట్టు మరి.

పద్మ: సరే పెడతా, పప్పు చారు అయిపోయాక.

హారిక: ఉట్టి అప్పడాలే వేయించకు. నాలుగు తిన్న వెంటనే ఇంక ఎక్కవు. కొన్ని వడియాలు కూడా వేయించు.

హర్షిత: దానికి నువ్వు చేసి పెట్టాలె కానీ వద్దు అని పోరపాటున కూడా అనదు.

పద్మ: పోనీ లే వే. ఎపుడో ఒకసారెగా. 

హర్షిత: నా చిన్నప్పటి నుంచి ఇది చెప్పే ఊరుకోబెడుతున్నావ్.

హారిక: అంతేలేవే, మా అమ్మాయికి నీ మీద ప్రేమతో నీ పేరే పెట్టుకున్నాగా, ఎన్నైనా అంటావ్.

హర్షిత: ముందు నేను మా అమ్మాయికి నీ పేరు పెట్టుకున్నా. అందుకని మళ్ళీ ఇది ఏమనుకుంటాడో అని నా పేరు పెట్టావ్ నువ్వు.

పద్మ: ఆపండే.

హారిక: తప్పు అమ్మ, అలా మాట్లాడకూడదు అని చెప్పు నీ పెద్ద కూతురికి. ఇదేనా నేర్పించింది నువ్వు.పద్మ: నాన్న ని పిలుస్తా.

హర్షిత: పిలువు మా.

పద్మ: అల్లుళ్ళు వున్నారు నాకు సిగ్గు వేస్తుంది. మీరే పిలవండి.

హారిక: ఓయబ్బో! పెళ్లి అయ్యి నలభై సంవత్సరాలవుతుంది. ఇంకా సిగ్గోకటి.

ముగ్గురూ మూసి మూసి నవ్వులు నవ్వుకుంటున్నారు. అంతలోనే మంచి నీళ్ల కోసం శివ వంట గదిలోకి వచ్చాడు. 

శివ: ఏంటి అంత క్యూట్ గా నవ్వుతున్నారు.

హారిక: ఇట్స్ ఏ గర్ల్స్ థింగ్.

శివ: 
ఇక్కడ గర్ల్స్ ఎక్కడ వున్నారు?

హారిక: కనిపించట్లేదా, ముగ్గురం వున్నాం. ఒప్పుకోకపోతే ఇవాళ డిన్నర్ కట్.

శివ: ఆమ్మో! యా ఐ సీ త్రీ బ్యూటిఫుల్ గర్ల్స్.
హారిక: గెట్ రెడీ ఫర్ పప్పుచారు+ ముక్కలు,అప్పడాలు అండ్ వడియాలు.

శివ: అబ్బా! ముందే చెప్తే నీళ్లు తాగకుండా ఉండేవాడిని గా.

హారిక: ఇంకొంచెం టైం పడుతుందిలే, అంతవరకు బావగారికి కంపెనీ ఇవ్వు.
శివ: ఓకే.


15 నిమిషాల తరువాత


పద్మ: ఇద్దరూ వెళ్ళి డైనింగ్ టేబుల్ సంగతి చుడండి.


5 నిమిషాల తరువాత 

హారిక: అందరూ రావాలి. వేడి అన్నం, పొగలు కక్కుతున్న పప్పు చారు, అప్పడాలు, వడియాలు, కాకరకాయ చిప్స్. 


గిరి: పదండిఅమ్మా తిందురు గాని.చిన్నారి హర్షిత: ఉండు తాతా, 2 నిమిషాల్లో అయిపోతుంది.

హారిక: నాన్న, ఇద్దరినీ తీసుకుని రా.

గిరి: మీ అమ్మాయి రావట్లా తల్లి.

హారిక: ఏయ్! హర్షిత, హారిక రండి.

చిన్నారి హర్షిత: ఉండు అమ్మ, చెక్ మెట్ చేసి వస్తా.

ఇది వింటూనే హారిక వరండా లోకి వెళ్ళింది.

హారిక- చిన్నారి హర్షిత: నీకు ఎన్ని సార్లు చెప్పాను! గెలవడం కంటే తినడం లోనే ఎక్కువ ఆనందం ఉంటుందని.చిన్నారి హర్షిత: సరే పదా.


2 నిమిషాల తరువాత, డైనింగ్ టేబుల్.

విష్ణు: మీరు కూడా కూర్చోండి అత్తయ్యా.

శివ: అవును అత్తయ్య, మీరు కూర్చోండి. కావాల్సింది మనమే వడ్డించుకుందాం.

పద్మ: మీరు తినండి బాబు, నేను తరువాత తింటాను లే.

శివ- చిన్నారి హర్షిత: అమ్మమ్మ ని కూడా తినమను.చిన్నారి హర్షిత: అమ్మమ్మ, నువ్ కూడా తిను, లేదంటే నీకు లేకుండా అమ్మ తినేస్తుంది. ఎపుడైనా ఇంటిలో నేను అన్నం తినను అంటే అమ్మ థాంక్స్ అని చెప్పి నాది కూడా తనే తినేస్తుంది. అందుకే నాన్న, నేను అనుకున్నాం ఎప్పుడు అన్నం వద్దు అని చెప్పకూడదని.

పద్మ: తింటే తినని అమ్మ, ఆకలి ఉంటేనే కదా తింటారు

చిన్నారి హర్షిత: అయ్యో, నీకు తెలీదా! మా అమ్మ ఆకలి తెచ్చుకుని తింటది.

హారిక: ఒసేయ్, నువ్వు మూసుకుని తిను. మా! నువ్వు కూడా కూర్చొని తిను.

పద్మ: సరే తింటున్నా లే.

చిన్నారి హర్షిత: మూసుకుని ఎలా తినమంటా?

హారిక: నీకు ఆ పేరు పెట్టి తప్పు చేసానే.

హర్షిత: ఎవడు పెట్టమన్నాడు?

హారిక: అదే, నా బుద్ధి తక్కువై పెట్టానంటున్నా.

గిరి: మీ పిల్లలు బావున్నారు, మీ కంటే.

విష్ణు: పిల్లలు చాలా మేలు మామగారు వీళ్ళకంటే.శివ: తిట్టుకున్నా కూడా వాళ్లిద్దరూ ప్రేమతోనే.
విష్ణు: అన్నదమ్ముల్లో రామ లక్ష్మణులు ఎలానో 
శివ: భార్య భర్తలలో శివ పార్వతులు ఎలానో 

విష్ణు: అక్క చెల్లెళ్ళో హర్షిత-హారిక అలా.

శివ: ఇక్కడ ఇన్ని చెప్తున్నా ఆ తిండి మీద ద్యాస చూడు.

హారిక: చాల కాలం అయింది మా అమ్మ చేతి పప్పు చారు తిని. అయినా తినేటపుడు ఎక్కువగా మాట్లాడకూడదని నేర్పించారు మా అమ్మ నాన్న. 
విష్ణు: పొగిడి నందుకు ఒక చిన్న థాంక్స్ అయినా మొహాన పడేయండి.

హారిక: థాంక్స్ బావగారు!

శివ: అలా పొగిడాక కూడా ఇంకా తినబుద్ది అవుతుందా.

హారిక:మీరు పొగిడితే నా కడుపు నిండదండి, నేను తింటే నిండుతుం
 ది. నేను డాక్టర్ని. రోజు చాల మంది పొగుడుతుంటారు, దండాలు పెడుతుంటారు, కాళ్ళ మీద పడుతుంటారు. అవన్నీ ఆ క్షణాన వదిలేసి తరువాత కేసు చూడాలి. పొగడ్తయినా, తిట్టు అయినా, కోపం అయినా, నవ్వు అయినా, ఆనందం అయినా, బాధ అయినా అన్ని క్షణికమే. 

శివ: మా శ్రీమతి చెప్పేది వింటుంటే నా కడుపు నిండిపోతుంది.

హారిక: మంచిది, నా వడియాలు అయిపోయాయి. నీవి నాకు ఇచ్చేయి.

శివ: తీసుకో డార్లింగ్, నా జీవితమే నీది. వడియాలు ఎంత.

శివ- చిన్నారి హర్షిత: (చెవిలో) అమ్మని పప్పు చారుతో తింటున్నావా? తాగుతున్నావా ? అని అడుగు.

హారిక: పప్పు చారు తింటున్నావా? తాగుతున్నావా అని అడగమంటున్నావా?

శివ: ఛీ కాదు కాదు! పెరుగు లో ఉసిరికాయ పచ్చడి నంచుకో బావుంది అని చెప్తున్నా. కదమ్మా హర్షి.

చిన్నారి హర్షిత: కాదమ్మా! నువ్వు అడిగిందే అడగమన్నాడు.

చిన్నారి హారిక: తాతయ్య రేపు గాలి పటం కొనిస్తావా.

గిరి: 
హా, పొద్దున్నే భోగీ మంట వేసుకుని, సాయంత్రం గాలి పటాలు సంగతి చూద్దాం.

ద్మ: ఆ కట్టెలు తెచ్చారా! భోగి మంటలోకి.

గిరి: తీసుకొచ్చా, మంచు పడకుండా కవర్ కప్పా.


౩౦ నిమిషాల తరువాత


చిన్నారి హర్షిత: నాన్న కథ చెప్పు నాన్న.

శివ: నాకు బాగా నిద్రొస్తుంది అమ్మ. అమ్మ ని చెప్పమను ఇవాళ్టికి.

చిన్నారి హర్షిత: అమ్మా! నాన్న ఇవాళ నిన్ను చెప్పామన్నారు కథ.

హారిక: ఇలాంటివి నా వల్ల కాదులే. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళు.చిన్నారి హర్షిత: సరే, హారిక ని కూడా పిలుస్తా.


2 నిమిషాల తరువాత 

చిన్నారి హర్షిత: అమ్మమ్మ!

పద్మ: ఏంటమ్మా?

చిన్నారి హర్షిత: కథ చెప్పు అమ్మమ్మ.

పద్మ: అనగనగనగా... ఒక ఊరిలో...

చిన్నారి హర్షిత: అమ్మమ్మ ఏదైనా రియల్ స్టోరీ చెప్పు.చిన్నారి హారిక: హా, నిజం కథ చెప్పు.
చిన్నారి హర్షిత: కాదు అమ్మమ్మ. నీ కథ చెప్పు.పద్మ: నా కథా!!!

చిన్నారి హర్షిత: హా.

పద్మ: సరే, మా నాన్న రైల్వే ఉద్యోగి. ఉద్యోగ రీత్యా వేరు వేరు ప్రదేశాలకి బదిలీ అవుతువుండేవారు. నా చిన్నప్పుడు నేను చాలా ఊరులు తిరిగేదానిని. ఎక్కడా స్థిరంగా ఉండేవాళ్ళం కాదు. నాగపూర్, లక్నో, ఔరంగాబాద్ ఇలా చాలా ఊరులు తిరిగేవాళ్ళం.
చిన్నారి హర్షిత: అమ్మమ్మ! అందుకేనా నీకు హిందీ బాగా వచ్చు.

పద్మ: అవును అమ్మ! నా చిన్నప్పుడు ఎక్కువగా హిందీ సినిమాలే చూసేదానిని. చదువుకున్న స్కూల్ కూడా హిందీ మీడియం కాబట్టి హిందీ బాగా వచ్చింది. 
చిన్నారి హారిక: కథ చెప్పు అమ్మమ్మ.పద్మ: స్కూలింగ్ అంత అలా అయిపోయాక మా నాన్న గారికి ప్రకాశం జిల్లా లోని వేటపాలెం కి ట్రాన్సఫర్ అయ్యింది. అక్కడే నేను గర్ల్స్ కాలేజీ లో డిగ్రీ చేశా. డిగ్రీ అయిపోయిన వెంటనే మా నాన్న గారు నాకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అలా సంబంధాలలో ఒకసారి మీ తాతయ్య ఫోటో తీసుకొచ్చి నాకు ఇచ్చి వాళ్ళు వచ్చే వారం నిన్ను చూసుకోడానికి వస్తున్నారు అనేసారు. ఇక పెళ్లి చూపులు అంటే ఇంట్లో అంతా హడావిడి. ఏవేవో ఆలోచనలతో రాత్రుళ్ళు నిద్ర పట్టేది కాదు. మా అమ్మని, నాన్నని, అన్నయ్యలని వదిలేసి వేరే వాళ్ళ ఇంటికి వెళ్లి ఇక వాళ్లింట్లోనే ఉండాలా అని చాలా భయం వేసేది. రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ఆ భయం ఇంకా ఎక్కువయ్యేది. ఇక పెళ్లి చూపుల రోజు మీ తాతయ్య వాళ్ళకి టీ ఇచ్చి తల దించుకుని కూర్చుంటే మీ తాతయ్య ఏమో నేను కొంచెం మాట్లాడాలని పెరటి లోకి తీసుకెళ్లారు. పెరటి లో జామ చెట్టు కింద మంచం వేసి ఇద్దరం కూర్చుని కాసేపు మాట్లాడుకున్నాం. ఆ తరువాత నాకు మీ తాతయ్య మీద నమ్మకం కలిగి కొంచెం భయం పోయింది.గిరి: పిల్లలు పడుకున్నారు... ఇంక నువ్వు పడుకో. నిద్రొచ్చి కాకుండా నీ వాగుడు భరించలేక పడుకుండిపోయుంటారు.
పద్మ: నువ్వు పడుకో ముందు. రేపు పొద్దున్నే భోగీ మంట వేయాలి.

* * * * * * * * * * *

శివ: ఈ రోజు చాలా ఆనందంగా వుండివుంటది శ్రీమతి గారికి...

హారిక: అంతా ఆనందాలే కాదు... బాధలు కూడా...

శివ: అదేంటి మళ్ళీ... అంత కష్టపడి నాలుగు రోజులు సెలవు తీసుకుని వస్తే !

హారిక: మా అమ్మ నాన్న ని చూడగానే ఆనందం వేసింది. మా అక్క ని చూడగానే ముందుగా ఆనందం వేసినా తర్వాత బాధ వేసింది.

శివ: అదేంటి ? ఏమి ?

హారిక: అది నాకంటే సన్నగా వుంది. ఇంతకుముందు తో పోలిస్తే బరువు కూడా తగ్గింది.

శివ: సరే! కాసేపు బాధ పడి నెమ్మదిగా ఏడువ్. నేను పడుకుంటున్నా.

హారిక: ఛీ! సిగ్గు లేదు. పెళ్ళాం బాధ పడుతుంటే ఓదార్చకుండా పడుకుంటావా!!! అయ్యో దేవుడా! ఎందుకయ్యా ఇలాంటి వాడిని కట్టబెట్టావ్ నాకు? నేనేం పాపం చేసానని?

శివ: దగ్గరే వున్నాడు కదా అని ప్రతిదానికి పిలిచేయకు. అసలే ఆయనకీ ఇద్దరు భార్యలు. ఇద్దరి బాధలు వింటుంటాడు పాపం. 

హారిక: వాళ్ళకి బాధలు ఏముంటాయి? నా బాధలే వింటాడు.

శివ: సరే చెప్పుకో... నేను పడుకుంటున్నా.

* * * * * * * * * * * * *

Comments

Popular posts from this blog

తెలుగు సామెతలు

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక అద్భుతమైన లేఖ ఇది.

12-February-1995