సంక్రాంతి కథ-2: భోగి రోజు...

గిరి ఉదయం అయిదు గంటలకే నిద్ర లేచి కట్టెలు, తాటి ఆకులు, ఎండిన కొమ్ములు, చెట్టు బెరడులు,పిడకలు,ఆవు నెయ్యి ,కాగితాలు, ఎండు గడ్డి తో కలిపి మంట వేసి ఇద్దరి మనవరాలను నిద్ర లేపాడు. ఇంతలో పద్మ కూడా లేచి ఇద్దరి కూతుర్లను లేపింది. అందరూ భోగీ మంట చుట్టూ చేరి చలి కాచుకున్నారు. దాదాపు అందరూ నిద్రలేవడంతో వీధి అంతా కోలాహలం గా మారిపోయింది. పది నిమిషాలకి మంట నిదానంగా తగ్గు ముఖం పట్టడం ప్రారంభించింది.  

ఇంతలో చిన్నారి హర్షిత ఒక పాత ప్లాస్టిక్ బొమ్మ తెచ్చి అందులో వేయబోయింది. 
x



హారిక: ఏయి హర్షి! ఆగు.

చిన్నారి హర్షిత: ఏమైందమ్మా!!!

హారిక: అలా భోగి మంటల్లో ప్లాస్టిక్ వేయకూడదు.

చిన్నారి హర్షిత: ఎందుకు?

హారిక: రబ్బర్, ప్లాస్టిక్, పెట్రోల్, కిరోసిన్  ఇవి అన్ని మంటల్లో కలిపితే, అవి తగలబడటం  వల్ల వచ్చే గాలిని మనం పీల్చితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం వుంది. 

చిన్నారి హర్షిత: మరి ఏమి వేయాలి?

హారిక: ఎండిపోయిన చెట్టు బెరడు, పిడకలు, ఇంట్లోని పాత చెక్క వస్తువులు.

చిన్నారి హర్షిత: కాగితాలు??

హారిక: తప్పు, కాగితాలని మనం రిసైకిల్  చేసి మళ్ళీ వాడుకోవచ్చు. వాటిని మంటలలో వేసి తగలపెడితే మనకి అవసరం అయినప్పుడు మళ్ళీ చెట్లను కొట్టాల్సొస్తుంది.

గిరి- పద్మ: నా కూతురు చూసావా? పెంపకం అంటే అది.

పద్మ- గిరి: దాని వాట్సాప్ స్టేటస్ గుర్తుందిగా "నేను నిన్న ఎం చేసినా, ఇవాళ  ఎం చేసినా, రేపు ఎం చేయబోయినా అది మా అమ్మ వల్లే", మర్చిపోయారేమో అని గుర్తుచేస్తున్నా.



చిన్నారి హర్షిత: మరి మంట ఆగిపోతుంది కాదమ్మా!!

హారిక: ఆగిపోయేలోపు మనం చేయాల్సింది ఒకటుంది.

చిన్నారి హర్షిత: ఏంటది?

హారిక: ఆ భోగి మంటలలో మనం వేసి తగలబెట్టుకోవాల్సింది పాత సామానులు, కట్టెలు మాత్రమే కాదు. మన పాత కోపాలు, ద్వేషాలు, బాధలు, చెడు అలవాట్లు, బాధ జ్ఞాపకాలు అన్ని. మంట దగ్గరికి వెళ్ళీ నీ మనసులో వున్నా ఆ చెత్తంతా అందులో వేసేయ్.

చిన్నారి హర్షిత: నాకు బాధలు ఏముంటాయి? నువ్వు రోజు పొద్దున్నే నిద్రలేపడం తప్ప!!!

హారిక: వెదవ తెలివితేటలు అన్ని. ఆ పేరు మహత్యం.

హర్షిత: నాన్న గారు మీ అమ్మాయి కి జాగ్రత్త చెప్పండి.


గిరి: సరే! మంట ఆరిపోతుంది, పదండి అందరూ చెడు వదిలేద్దురు.


హారిక: అమ్మా! ఇంకా అది ఊడ్చేసి ముగ్గు వేద్దామా.
పద్మ: హ.
హారిక- చిన్నారి హర్షిత: వెళ్లి చీపురు తీసుకురా.
గిరి- హర్షిత: మీ అమ్మాయి ఏంటే? ఎం మాట్లాడకుండా అలా వుంది?
హర్షిత: పేరు మహత్యం. చెప్పింది గా ఇందాక మీ ముద్దుల కూతురు.
గిరి: పిల్లలూ! ఇద్దరూ రండి మనం అలా వాకింగ్ కి వెళ్ళీ, వీధి లో ముగ్గులు చూద్దాం.
శివ: నేను కూడా వస్తాను మావయ్యా.
విష్ణు: హా పదండి.
హారిక- చిన్నారి హర్షిత: హర్షి, స్వేటర్ వేసుకుని, మంకీ కాప్ పెట్టుకుని, షూ వేసుకుని వెళ్ళు.

హర్షిత- చిన్నారి హారిక: మీ పిన్ని చెప్పింది చెయ్ నువ్ కూడా.

హారిక: అమ్మ ఎం ముగ్గు వేద్దాం.
పద్మ: మీ ఇష్టం. వేసేది మీరేగా.
హర్షిత: పేపర్ కట్టింగ్స్  ఎం లేవా!
పద్మ: ఎం లేవే. నేనేం కట్ చేయలా. కావాలంటే పేపర్స్ వున్నాయి.
హారిక: ఇప్పుడంతా ఓపిక లేదు.
శివ: మేం వెళ్తున్నాం.
పద్మ: త్వరగా వచ్చేయండి. టిఫిన్ పూరి.
గిరి: సరే. 
హర్షిత- హారిక: నెట్లో చూడు ఏమైనా.
విష్ణు: వాళ్ళిద్దరూ ఇప్పుడు మనల్ని పట్టించుకునే స్థితి లో లేరు లే. పదండి.


హర్షిత: నెమలి ముగ్గు వేద్దాం.
హారిక: హా సరే.
హర్షిత: అమ్మ! ముగ్గు, రంగులు ఎక్కడ వున్నాయి?
పద్మ: బయట మెట్ల కింద ముగ్గు బాక్స్ ఉంటుంది. దాని పక్కన రంగు పాకెట్స్ ఉంటాయి.
హారిక: పాలు పొసే అతనికి చెప్పు, కొంచెం పేడ తీసుకురమ్మని గొబ్బెమ్మలు పెట్టుకుందాం. 
పద్మ: నా ఫోన్లో నెంబర్ ఉంటది, కాల్ చేయి.
హర్షిత: ఎత్తట్లేదమ్మ.
హారిక: నువ్వు ఫోన్ ఎత్తుకురా! నేను చేస్తా.
పద్మ: ఇప్పుడు పంతాలు కాదు, పని చుడండి. నేను పిండి కలపాలి.
హారిక: మా ఆయన కి మెసేజ్ చేశా. దారిలో ఎక్కడైనా పేడ ఉంటే తీసుకురమ్మని. 
హర్షిత: సర్లే రా. మొదలుపెడదాం.
హారిక: వుండు, రిప్లై ఎం వస్తుందో చూడని.
హర్షిత: చూసావా నీ కూతురు, కాసేపు కూడా తట్టుకోలేకపోతుంది.
పద్మ: నాకు పని బానే వుంది. నన్ను మధ్యలో లాగకండి.

హారిక- పద్మ: ఈ రంగులలో ఇసుక కలిపావా లేదా!
పద్మ: అయ్యో మర్చిపోయానే!
హారిక: ఎం చేయకు, అన్ని నేనే చేసుకోవాలి.
హర్షిత: నేను చుక్కలు పెడతా. నువ్వు కలుపు. 
హారిక: నేనే చుక్కలు పెడతా.  అంతలోకి నువ్వు రంగులలో ఇసుక కలుపు.
హర్షిత: సరే. కానివ్వు.

పావు గంట తరువాత

హారిక: నాది అయిపోయింది. 
హర్షిత: నేను ఇంకా రంగులు కలుపుతున్నా. నువ్వే కలుపు ఆ చుక్కలని. 
హారిక: అబ్బా!!
హర్షిత: కలపవే, క్రెడిట్ అంతా నీకే వస్తుంది లే.
హారిక- పద్మ: మా!!!
పద్మ: ఏంటే?
హారిక: మా ఆయన ఏమైనా మెసేజ్ చేశారేమో చూడు?
పద్మ: ఇదొకటి నా ప్రాణానికి(మనసులో). హా చేశారే.

హారిక అది వింటూనే, ముగ్గు గిన్నె పక్కన పెట్టి పరుగున ఇంట్లోకి దూకింది. 
హారిక: పాటర్న్ తీయి.
శ్రీ వారు: తప్పకుండా తీసుకొస్తా. ఒక లారీ ని పంపించు.
పద్మ: ఏంటే,
హారిక: లారీ పంపించాలంటా. ఎంత పొగరో చూసావా.
పద్మ నెమ్మదిగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది.

హారిక: పద్మ శ్రీ గారు! ఆ నవ్వు కి అర్ధం ఏంటండీ?
పద్మ: వద్దులే! చెబితే మళ్ళీ నన్ను తిడతావ్.
హారిక: ఇపుడు చెప్పలేదంటే బాగోదు. చెప్పు.
పద్మ: పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్టు అనే సామెత విన్నావా.
హారిక: హా, ఇప్పుడు అది ఎందుకు వచ్చింది. 
పద్మ: తమరికి పొగరు, ఇక అందరూ పొగరు లానే కనిపిస్తారు.


ఇంతలో హర్షిత లోపలి వచ్చింది. మీ ఇద్దరూ ముచ్చట్లు చెప్పుకుంటే బయట నేను పిచ్చిదానిలా ముగ్గు వేయాలా.
పద్మ: హారిక! వెళ్లు, ముగ్గు సంగతి చుడండి పోయి. 

ఇంతలో వాకింగ్ కి వెళ్లిన అందరూ తిరిగొచ్చేశారు. చిన్నారి హర్షిత చేతిలో లోలిపోప్స్ ఉండటం గమనించింది హారిక.
హారిక- చిన్నారి హర్షిత: హర్షి! ఇలా రా నాన్న.
శివ- చిన్నారి హర్షిత: లోలిపోప్స్ ఎలాగూ తీసుకుంటది. కనీసం జేబు లో జెమ్స్ అయినా కనపడకుండా దాచుకో.

హారిక: అల్ఫ్రెంలిబీ ఏ నా?
చిన్నారి హర్షిత: అవునమ్మా!!!
హారిక: ఏమి ఏమి వున్నాయి?
చిన్నారి హర్షిత: స్ట్రాబెర్రీ, చాక్లెట్.
హారిక: తినలేదే ఇంకా!
చిన్నారి హర్షిత: నాన్న, బ్రష్ చేశాక తినమన్నారు.
హారిక: సర్లే, ఓ రెండూ ఇటు ఇవ్వు.
చిన్నారి హర్షిత: సరే
హారిక: ఆ రెండూ మీ ఇద్దరు తినండి. చేతులు బాలేవు, తీసి నోట్లో పెట్టు కొంచెం.
హర్షిత: రెండు తీసుకుంటే ఒకటి నాకు ఇస్తావ్ అనుకున్నానే.
హారిక: ఇచ్చేదాన్నే, కానీ రెండూ వేరు కదా!
హర్షిత: అయినా ఇంకా బ్రష్ చేయలేదు గా.
హారిక: మా అత్తింట్లో అలాంటి పట్టింపులేం లేవు.
హర్షిత: సిగ్గు ఉండాలి, కొంచెం అయినా. ఇంత వయస్సు వచ్చింది. ఏమి ఉపయోగం?
హారిక: హెల్లో, ఈ ఇంటిలో ఎప్పటికి నేనే చిన్న పిల్లని.
హర్షిత: చిన్న పిల్ల, నువ్వా! ఎనభై కి తొంబై కి మధ్యలో వున్నావ్.
హారిక: చిన్న అంటే వయస్సులో. పర్సనల్ విషయాలు మాట్లాడకు.
హర్షిత: అయినా జుంబా క్లాస్ కి వెళ్లి అయిపోయిన తరువాత పానీపూరి తిని వస్తున్నావంటగా.
హారిక: నీకు ఎవరు చెప్పారు?
హర్షిత: ఎవరైతే నీకెందుకు.
హారిక: ఆయనేగా, అయిపోయాడు నా చేతిలో వెళ్ళాక.

హర్షిత: అడిగిన దానికి చెప్పు!
హారిక: పానీపూరి ఒక్కటే చెప్పాడా! భేల్ పూరి, సేవ్ పూరి, దహీ పూరి, పాపిడి చాట్ చెప్పలేదా.
హర్షిత: ఏంటి ఒక రోజే తింటున్నావా ఇవన్నీ?
హారిక: ఇంస్టాల్మెంట్స్ లో తినమంటావా, రోజు కొంచెం కొంచెం.
హర్షిత: సెంచరీ కొట్టాక చెప్పు అయితే, ఫంక్షన్ చేద్దాం.
హారిక: పని చూడు ముందు.

ఇంతలో అల్లుళ్ళు ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చుని పేపర్ చూస్తుండగా... వంట గదిలో అత్తయ్య పడుతున్న కష్టం చూసి ఇద్దరూ వెళ్లారు. పిల్లల్ని పిలిచి పిండి ఉండలు చుట్టామన్నారు. 

శివ: అత్తయ్య ! రోజు మీరే కదా వండుతారు. ఇవాళ కనీసం పూరి చేసే అదృష్టం అయినా మాకు ప్రసాదించండి.

విష్ణు: పిల్లలు ఉండలు చుడతారు, నేను పూరి చేస్తాను, తమ్ముడు నూనె లో పొంగించేస్తాడు. మీరు అలా పక్కన నుంచుని అంతా పద్దతిగా చేస్తున్నామో లేదో చుడండి.

శివ: ఏమైనా చెప్తూ వుండండి అత్తయ్య!
పద్మ: ఏదోకటి.
శివ: మీ చిన్న అమ్మాయి చెప్పింది, మీ నోరు అసలు మూత పడదని, ఎపుడు వాగుతూనే ఉంటారని.
పద్మ: అయ్యో అలా చెప్పిందా!
శివ: హా.. పెళ్లైన కొత్తలో మీ ఇంట్లో వాళ్ల గురించి చెప్పు అంటే చెప్పింది.
గిరి: నా గురించి ఎం చెప్పింది అల్లుడు?
శివ: మీరు బాగా మొండి అని. చేయాలనుకుందే చేస్తారు కానీ ఎవరి మాట వినరని.
పద్మ: ఇంకా..
శివ: పెద్ద అమ్మయిమో జగ మొండి అని... మావయ్య గారి పేరు నిలబెట్టడానికే పుట్టిందని...
పద్మ: దానికి వొళ్ళంతా బద్ధకం, తలంతా పొగరని చెప్పలేదా!!!
శివ: చెప్పలేదే.. మీరు చెప్పండి ఇప్పుడు...
పద్మ: అది అసలు చిన్నప్పటినుండి బాగా గారాబం తో పెరిగింది. 

అర్ధగంట తరువాత...





Comments

Popular posts from this blog

తెలుగు సామెతలు

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక అద్భుతమైన లేఖ ఇది.

12-February-1995