10-10-2015

10-అక్టోబర్-2015
కాకినాడ.
మధ్యాన్నం ఒంటి గంట.

సూర్యుడు నిప్పులు కక్కుతున్న వేళ.

భూమి మీద చెప్పులు లేకుండా నడవడం, నిప్పులు మీద నడవడం ఒకేలా ఉంది అపుడు.

క్లాస్ రూమ్ నుంచి హాస్టల్ దగ్గరికి నడిచి వచ్చేసరికి షర్ట్ అంతా తడిచి ముద్దయింది. షర్ట్ మార్చుకుని లంచ్ చేద్దామని మెస్ లోకి వెళ్ళాను. ఆ పప్పు నచ్చలేదు. వడియాలు వేయించుకుని ఉత్తవే తినేసి, పెరుగుకి మజ్జిగకి మధ్యలో వుండే ఆ ద్రవాన్ని ప్లేట్లో పోసుకుని తాగాను. ఎందుకో తెలీదు ఆ రోజు ఎదో అద్భుతం జరుగుతుందేమో అని అనిపిస్తూ ఉంది. మెస్ నుంచి రూమ్ కి వెళ్ళాను. చిన్న నిద్ర వేశాను. 1:50 కి శశాంక్ వచ్చి నిద్ర లేపాడు. త్వరగా మొహం కడుక్కుని, లాబ్ డ్రెస్, షూ వేసుకుని, manual, record  తీసుకుని పరుగున లాబ్ కి బయలుదేరాను. అది  heat transfer లాబ్. కొంచెం late అయినా తిట్లు తప్పవు. దేవుడు దయ వల్ల టైం కి వెళ్లగలిగాను. 

లాబ్ జరుగుతుంది కానీ, మనసు మాత్రం ఎక్కడో ఉంది. చాలా కష్టమైన ఫీలింగ్ అది. మాటల్లో చెప్పలేను. లాబ్ అయిపోయింది నెమ్మదిగా నడుచుకుంటూ హాస్టల్ కి వెళ్తున్నా. చాలా కాలంగా దూరంగా ఉన్న బాస్కెట్ బాల్ కోర్ట్ రా రా అని పిలుస్తున్నట్టు అనిపించింది. ఏమైందో ఏమో  పది నిమిషాల్లో కోర్టులో వున్నా. చాలా కాలంగా ఆడలేదన్న బాధతో 7 వరకు ఆడుకున్నా.

వచ్చేటప్పుడు మెస్ లో మళ్ళీ మజ్జిగ తాగేసి, స్నానం చేసి, పుస్తకాలు పట్టుకుని కూర్చున్నా.
గేట్ ఎక్సమ్ కి count down 100 days లోపలకి వచ్చేసింది అని గ్రూపులో మెసేజ్. ఒక్కసారిగా తన్నుకుని వచ్చింది కసి. చదవడం మొదలు పెట్టా.
పది నిమిషాలయింది, కానీ పేజీ తిరగట్లేదు. పుస్తకం పక్కన పెట్టి మేడ మీదకి వెళ్లి చల్ల గాలికి అటు ఇటు తిరుగుతున్నా. అంతలో గుర్తొచ్చింది నేనూ శైలజా లో ఫస్ట్ సాంగ్. వెంటనే ఫోన్ తీసి పాటలు పెట్టుకున్నా. నాకేం తెలుసు నాకోసం కొన్ని వేళ్ళు ఒక సందేశాన్ని పంపడానికి సిద్ధమవుతున్నాయని.

అంతలో వచ్చిందో సందేశం. 
Tammu
వెంటనే ఇంకొకటి
Guess where???

హారిక నుంచి మొదటి మెసేజ్. బహుశా జీవితంలో మొదటిసారి, నా గుండె వేగం వంద దాటింది. ఇదేనా ఈరోజు నేననుకుంటున్న మంచి. ఎన్నో ఆలోచనల మధ్యలో నా చేతులు రిప్లై టైప్ చేసేసాయి.

Ekkada !!! అని

అటు నుంచి వెంటనే సందేశం 

Inbox: In kkd

Reply: Avna!!! Ekkada 

Inbox: D Mart

Reply: avunaa, ma hostel daggare. Ravacha!!

Inbox: Ippuda!! Nikem ibbandi ledaa?

Reply: nakem ibbandi ledu, start aithey 10 mins lo ne dagara vunta

Inbox : avasarama, e time lo ???

Reply: nakem problem ledu, niku emaina problem vunda?

Inbox: naku em ledu, sare

Reply: rammanutunnava

Inbox: Hmm

Reply: vachestunna, 10-15 mins lo vasta.

ఫోన్ చేతిలో పట్టుకుని పరిగెత్తుకుని కిందకి వచ్చాను... 
నెమ్మదిగా రూమ్ డోర్ తీసాను, కానీ ఆ చిన్న శబ్దానికే చదువుకుంటున్న శశాంక్, బీలా ఇద్దరూ డిస్టర్బ్ అయినట్టుగా తల పైకి లేపారు. నేరుగా పిల్లిలా  నా బ్యాగ్ దగ్గరికి వెళ్లి వాలెట్ తీసుకుని జేబులో పెట్టుకుని, కాళ్ళకు చెప్పులు వేసుకుంటుండగా కళ్ళు సబ్బు పెట్టె వైపు తిరిగాయి, అదే సమయంలో మనసులో "ఇపుడు ఫేస్ వాష్ చేసుకుంటే  ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతారు. చెప్పే కొద్దీ ప్రశ్నలు ఇంకా పెరుగుతాయి. ఇపుడు మనకి అంత టైం లేదు. కానీ, మొహం జిడ్డుగా ఉంది కదా. ఇలా ఎలా వెళ్తావ్?"

నిదానంగా డోర్ క్లోజ్ చేసి కారిడార్ లోకి వచ్చాను. పక్క రూంలో ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి పౌడర్ అడిగాను.
ఫ్రెండ్: ఈ టైం లో ఏ పాప దగ్గరికి వెళ్తున్నావ్? వాళ్ళ హాస్టల్ ఔటింగ్ టైం అయిపోయింది కదా??
చిన్న నవ్వు నవ్వేసి, పౌడర్ చేతిలో వేసుకుని బైటకి వచ్చాను. స్పెక్స్ తీసి మొహానికి పౌడర్ పులుముకుని, పరుగుకి, నడకకి మధ్యస్తంగా వుండే వేగంతో కదిలాను. కానీ కళ్ల ముందు మాత్రం తన రూపం కదాలడుతుంది.

హారిక

ఆరవ తరగతిలో మొదటి సారి చూసాను..స్కూల్ బస్ లో... బెంచ్ మీద... నవ్య పక్కన. 
స్కూల్ డ్రెస్ లో... సాయంత్రం నాలుగు గంటల తరువాత... జిడ్డు మొహంతో....

పదవ తరగతిలో చివరిసారిగా చూసాను... చివరి పరీక్ష రాసిన తరువాత... వెనుక నుంచి... డ్రెస్ కలర్ గుర్తులేదు, అప్పటికి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయి ఉన్నాయి.

నాకు పరిచయం అయినపుడు తనది బేబీ క్రాఫ్
నాకు దగ్గర అయినపుడు తనది జులపాల జుట్టు
నాకు దూరం అయినపుడు తనది పిలకల జుట్టు
నన్ను వదిలి వెళ్లిపోయేటప్పుడు మాత్రం బాగా అల్లిక కుదిరిన జడ.

కొద్ది సేపటికి కాళ్ళల్లో వేగం తగ్గింది, నొప్పి మొదలైంది, కానీ తన జ్ఞాపకాలు మాత్రం పరిగెడుతూనే ఉన్నాయి.

కి, కు, యొక్క, లో, లోపల షష్టి విభక్తి అని అందరి ముందు ధైర్యంగా చెప్పిన హారిక.

నేను క్రికెట్ ఆడుతుంటే పక్కనే తొక్కుడు బిళ్ళ ఆడిన హారిక.

అదిరేటి డ్రెస్ మేమేస్తే, బెదిరేటి లుక్స్ మీరిస్తే దడ అంటూ ఆడిన హారిక.

నీటిలో చేపలు, చేతిలో పాపలు.. గాలివాన హోరు జల్లులు అంటూ పడుతూ ఆడిన హారిక.

తెల్ల బట్టల్లో సాక్షాత్తు దేవ కన్యలా వుండే హారిక.

తన బ్యాగ్ దాచిపెడితే కంగారు పడి బస్ అంతా పిచ్చిగా వెతుకులాడిన హారిక.

తన textbook కవర్ చించేశానని ఎక్కి ఎక్కి ఏడ్చిన హారిక.

క్లాస్లలో ఫస్ట్ బెంచ్లో కూర్చుని పడుకున్నా కూడా ఒక్కసారి కూడా దొరకని హారిక.

చేప పిల్లతో ఆడుకున్న హారిక.

తనని చూస్తూ చదవడం నేర్చుకున్న హారిక.

తనని చూస్తూ వ్యక్తిత్వం నేర్చుకున్న హారిక.

తనని చూస్తూ నడవడిక నేర్చుకున్న హారిక.

తనలా ఉండాలని కోరుకున్న హారిక.

తను వేరే స్కూల్లో చేరకూడదని సాయి కోటి రాసినా... 
తను మళ్ళీ కనపడాలని ఇంద్రకేలాద్రికి నడుచుకుని వెళ్లినా...
తను కనిపిస్తుందేమో అని ఔటింగ్లు మానుకుని గర్ల్స్ కాలేజ్లలా చుట్టూ తిరిగినా...
అది నా హారిక కోసమే.

చీకటిగా వున్న రోడ్, చుట్టూ ఎవరూ లేరు...
దారి తప్పిపోయానేమో అనిపించింది.
వెంటనే మొబైల్లో గూగుల్ మాప్స్ లో సెర్చ్ చేశాను..
అందులో వాక్ నావిగేషన్ పెట్టుకుని పరిగెట్టాను.
తనని చూడాలని కోరిక, కలవాలని ఆత్రుత.

D MART చేరుకున్నాను. ఒకసారి చెమట పట్టిన మొహాన్ని తుడుచుకుని... లోపలికి వెళ్తూ తనకి కాల్ చేశాను. CLOTHES దగ్గర వున్నానని చెప్పింది. పరుగున మెట్లు ఎక్కుతుండగా ఎవరో ఎదురు వస్తున్నట్టు అనిపించి తల పైకి ఎత్తాను.

తను.

గుండె 2 సెకండ్లు ఆగిపాయింది. చుట్టూ ప్రపంచం స్తంబించింది. తను నన్ను చూసి నవ్వింది. బైటకి వెళ్దాం అనింది. ఇద్దరం కలిసి బైటకి వచ్చి పార్కింగ్ స్పేస్ లో కూర్చున్నాం. తను నా పక్కన కూర్చుంది.



పగలంతా ఎండ వేడికి ఆవిరిన నీరు, సముద్రం మీద నుంచి భూమి పైకి వచ్చే గాలిలో తేమగా శరిరాన్ని తాకుతున్నవేల...
తన కురులు గాలికి ఎగిరి నా మీద పడుతున్న ఆ సమయంలో...
పైకి చూస్తే నక్షత్రాలన్నీ కళ్ళు పెద్దవిగా చేసుకుని మా ఇద్దరినే చూస్తున్న వేల...
ఇంటికి చేరిన గువ్వలు, పిల్లలకి లాలి పాటలు పాడుతున్న వేల...
ఆహార వేటకి గబ్బిలాల గుంపు బయలుదేరబోతున్న వేల...
దూరంగా చుస్తే ఆ చీకటిలో ఎవరూ చుడట్లేదనుకుని ఆకాశం, భూమి చుమ్భించుకున్తున్నట్టు వున్న వేల...
తన పెదాలను తాకి, దిశ మారి నా వైపు వస్తున్న గాలి,
మాట్లాడటానికి కదులుతున్న తన పెదాలు ని చూసి అదురుతున్న నా గుండె,
అపుడు చెప్పింది తనోకమాట   చెప్పు   అని
ఆ పదం ముందు అప్పటివరకు విన్న ఇళయరాజా గీతాలు కానీ, కీరవాణి రాగాలు కానీ, వేటూరి పాటలు కానీ, సిరివెన్నెల పల్లవులు కానీ దేనికి పనికి రావు అనిపించింది.

ఏం చెప్పాలో మాట రాలేదు నాకు...
ఇంతకుముందు ఏడిపించిన దానికి క్షమాపణ చెప్పాలా...
స్నేహానికి పచ్చ జెండా ఊపినందుకు ధన్యవాదాలు చెప్పాలా...
బాగా లావయ్యావ్ అని దిష్టి పెట్టాలా...
నీ స్నేహితులును పరిచయం చేయమని ఆట పట్టించాలా.. 
అని ఆలోచిస్తుండగా తనే మాట్లాడింది ఎలా వచ్చావ్ అని.
నేను: నడుచుకునే వచ్చా
తను: దగ్గరేనా!
నేను: ఒక షార్ట్ కట్ ఉంటుంది లే.
తను: ఓ!!! 
నేను: ఎప్పుడు వచ్చావ్ కాకినాడ?
తను: మొన్న సాయంత్రం
నేను: ఎందుకు?
తను: అమలాపురం లో సెమినార్ ఉంటే వచ్చాము.
నేను: ఎంత మంది?
తను: నాలుగురుమ్
నేను: ఎప్పుడు వెళ్తున్నారు?
తను: రేపే.
అంతలో తన మొబైల్ రింగ్ అయ్యింది. తను మాట్లాడుతూ దూరంగా వెళ్ళింది. తనకి కాకినాడ సుబ్బయ్య హోటల్ రుచి చూపిద్దాం అనుకున్నా, కుదరట్లేదు అని మనసులో ఒక బాధ. నడుస్తూ దూరంగా వెళ్తున్న తనని చూస్తే ఇంకా బాధ. మళ్ళీ వచ్చి నా పక్కన కూర్చుంది. తను చూడకుండా తన కాళ్లకు నమస్కరిద్దాం అనుకున్నా, కానీ తనని తాకాలంటే భయం, ఎం అనుకుంటుందో అని, అందుకే తన కుడి చెప్పు చివర తాకి మనసులో క్షమాపణ కోరుకున్నా.

ఇంకేంటి అంటూ తను నా వైపు తిరిగింది. మొదటి సారి తన కళ్ళలోకి నేరుగా చూసాను. చాలా అందమైనవి అవి, నేను మొనలిసా చిత్రపటం చూడలేదు కానీ, నేను నా జీవితంలో చూసిన అందమైన కళ్ళు తనవే. ఆ కంటిలో, తన కనుపాపల్లో నా ప్రతిబింబాలు రెండు. చాలా అందంగా ఉంది ఆ ఫీలింగ్. చాలా భావోద్వేగాలతో మనస్సు నిండింది. తనకి అంత దగ్గరగా కూర్చుని తన కళ్ళలో నా రూపాన్ని చూసుకుంటూ ఆ క్షణం ప్రపంచం ఆగిపోతే బావుండనిపించింది. పోనీ దేవుడు గతంలోకి వెళ్లే అవకాశము ఇస్తే నేను మొదటిగా వెళ్ళాలనుకునే సమయం అది.


అంతలోనే తన స్నేహితులు బైటకి వచ్చారు. పద వెళ్దాం అంటూ తను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లింది. నాకు మాత్రం సిగ్గు, బిడియం మొదలయ్యాయి. అందరిని పరిచయం చేస్తూ పేర్లు చెప్తుంది. అపుడు చూసాను మొదటి సారి తనని. అనూష. ఆ పేరు విన్న తరువాత, తనని చూసిన తరువాత అంతకుముందు విన్న పేరులు, ఆ పేరు తరువాత విన్న పేరులు ఒక చెవిలోంచి లోపలికి వెళ్ళి మరో చెవిలోంచి బైటకి వచ్చాయి.  
పేరైతే అనూష కానీ, ఇంటి పేరు అందం ఏమో తనది. ఆనాటి కాలంలో సావిత్రి, జమున, అంజలీదేవి, జయలలిత, జయసుధ, జయప్రద, శ్రీదేవి, సౌందర్య, సిమ్రాన్, రాశి, రంభ, మీనా, రమ్యకృష్ణ, 
నుంచి
నేటి తరం సమంత, కాజల్, తమన్నా, అనుష్క, మెహరీన్, రకుల్, రెజీనా, రాసి, నిత్యా, నిధి, పాయల్ వరకు అందరూ తన బంధువులు లా అనిపించారు. తొలి చూపులో ప్రేమలో పడటం అంటే అదేనేమో. మళ్ళీ చూడాలని అనిపించినా, హారిక చూస్తాదేమో అనే భయంతో తల పైకి లెగవలేదు. 

అంతలోనే ఒక పిడుగు. సరే, ఇక వెళ్తున్నాం అనింది హారిక. చాక్లెట్ ఒకటి చేతిలో పెట్టి కంగ్రాట్స్ చెప్పింది. ఎందుకో నాకు అర్థం కాలేదు. జాబ్ వచ్చినందుకు అని చెప్పింది. తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకో తెలీదు. తీసుకోకపోతే బాగోదు అని అనింది. తీసుకుంటూ మళ్ళీ ఒకసారి అనూష వైపు చూసా. అందరిలోకి తనే చిన్నది. అయితే ఎం హృదయ రాజ్యానికి మహా రాణి లా అనిపించింది. చిన్ని కళ్లు, చిట్టి చేతులు, బుల్లి బుల్లి పదాలు, ఉందొ లేదో అనిపించే ముక్కు, వెన్నెల నీడలో ఎర్రగా మెరుస్తున్న పెదాలు, పట్టుకుని లాగాలని పించే బుగ్గలు, హత్తుకోవాలనిపించే ఎత్తు. 

చాక్లెట్ తీసుకుని హారిక కి బై చెప్పి, వెనక్కి తిరిగి వెళ్తుంటే " వెళ్తావా! డ్రాప్ చేయాలా?" వద్దు, నేను వెళ్తానని చెప్పి నడుచుకుని వెళ్తున్నా. మళ్ళీ ఒకసారి అనూష ని చూడాలనిపించి వెనక్కి తిరిగి చూసాను. నలుగురు అమ్మాయిలు, అందులో చిన్న అమ్మాయి, వెనుక నుంచి కూడా అందంగానే ఉంది, బహుశా తన జుట్టు వల్ల ఏమో.

వచ్చేటప్పుడు ఆత్రుత ఐతే, తిరిగి వెళ్ళేటప్పుడు ఆనందం. మనకి చాలా ఇష్టమైన వాళ్ళని 5 సంవత్సరాల తరువాత 5 నిముషాలు కలిస్తే, మీకు ఎలా ఉంటుందో తెలీదు కానీ, నాకైతే ఆ క్షణాలని మనస్సులో గోడల మీద ఫ్రేమ్లు కట్టుకుని పెట్టుకుంటా. తన మాటలు, తన చూపులు, తన కురులు, తన దగ్గు, తన చీమిడి, తన గొంతు, తన నడక అన్ని గుర్తొస్తున్నాయి.

తిరిగి వెళ్తున్నప్పుడే దూరం విలువ తెలుస్తుందంటారు, వచ్చేటప్పుడు ఆరాటం వాళ్ళ తెలియలేదు కానీ, దూరం ఎక్కువే. దానికి తోడూ మెయిన్ గేటు మాత్రమే తెరుస్తారు 9 దాటాక, చుట్టూ తిరిగి వెళ్ళాల్సొచ్చింది. దాదాపు ౩KM. హాస్టల్ గేటు దగ్గరికి రాగానే WATCHMAN రిజిస్టర్లో పేరు రాయమన్నారు. రాస్తుండగా పక్కన వాళ్ళ అబ్బాయి ఏడుస్తూ కనిపించాడు, ఏమైంది అని అడిగాను, ఐస్ క్రీం కొనిపించమని అడిగాడు సర్, నేను కొనివ్వలేదు, అన్నం తినకుండా ఏడుస్తున్నాడు. హారిక ఇచ్చిన చాక్లెట్ తనకి ఇచ్చాను, ఏడుపు ఆపేసాడు. తన జ్ఞాపకాలతోనే నిదానంగా ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ రూంకి బయలుదేరా.

రూమ్ కి వెళ్ళిన వెంటనే బీలా ఎదురుగా వున్నాడు.
బీలా: ఏ అమ్మాయి తో వెళ్ళవు రా? ఈ టైములో? నిజం చెప్పు ఎక్కడికి వెళ్ళావో?
నేను: ఫ్రెండ్ రా. స్కూల్ ఫ్రెండ్.
బీలా: అమ్మాయి ఏనా?
నేను: హా
బీలా: అబ్బాయి ఐతే నువ్వు ఎందుకు వెళ్తావ్ లే!!!
నేను: ఆ అమ్మాయి కాకినాడ వచ్చింది, D మార్ట్ లో వుంటే వెళ్లి కలిసొచ్చా.
బీలా: సరే, ఇంకా బుక్స్ తీయి.

అంతలో అమ్మ ఫోన్, ఫోన్ తీసుకుని రూమ్ బైటకి వెళ్తుండగా...
బీలా: ఆ అమ్మాయి ఏనా?
నేను: అమ్మ రా.

15 నిమిషాల తరువాత.

బీలా: రా, బుక్స్ పట్టుకో.

బుక్స్ తీసుకుని, బీలా పక్కన కూర్చుని చదవడం మొదలుపెట్టా.
అంతలోనే తన మెసేజ్, vellava అని, రిప్లై టైపు చేస్తుండగా
బీలా: ఆ అమ్మాయి ఏనా.
నేను: 2 మినిట్స్ రా, గుడ్ నైట్  చెప్తా.
బీలా: అది చూస్తా.

చాక్లెట్ తిన్నావా అంటూ తను మాట్లాడుతుంది,
బీలా: రేయ్, 2 మినిట్స్ అయిపోయాయి.
నేను: ఇంకో 2 మినిట్స్ రా.

మొబైల్ లాక్కుని హటాత్తుగా రూమ్ బైటకి పరిగెత్తి డోర్ లాక్ చేసాడు బీలా. మెసేజెస్ ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టాడు. నేను వద్దురా బీలా ప్లీజ్ రా అని బ్రతిమలడుతున్నా.
బీలా: చాక్లెట్ ఇచ్చిందా, ఏది రా, watchman వాళ్ళ అబ్బాయి కి ఇచ్చావా.
బీలా: రేయ్ సత్తి, మా రూంలో మురారి ఎవరో అమ్మిని కలవడానికి వెళ్ళాడు. ఆ అమ్మాయి ఏమో వీడికి చాక్లెట్ ఇచ్చింది.
సత్తి: ఎక్కడుంది చాక్లెట్, తినేసారా?
బీలా: watchman వాళ్ళ అబ్బాయికి ఇచ్చాడంట లే.
సత్తి: వాడిని మా రూంకి పిలిచి స్టొరీ చెప్పమను.

రూమ్ డోర్ ఓపెన్ చేసి, పక్క రూంకి లాక్కుని వెళ్లి, కూర్చోడానికి ఒక కుర్చీ వేసి, ఒక 8 మంది చుట్టూ కుర్చుని...

బీలా: స్టార్ట్ చెయ్, మొదటిసారి ఎప్పుడు??? ఎక్కడ??? ఎలా???
నేను: అంతెం లేదు, మంచి ఫ్రెండ్.
సత్తి: ఇపుడు చెప్పకపోతే ఐ లవ్ యు అని వేల్లిపోద్ది.
నేను: వద్దు రా, ప్లీజ్ , చెప్తా. ఆ వాటర్ బాటిల్ ఇవ్వు.








Comments

Popular posts from this blog

తెలుగు సామెతలు

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక అద్భుతమైన లేఖ ఇది.

12-February-1995