నమ్మక తప్పదు నిజమైనా- బొమ్మరిల్లు

పల్లవి

నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇప్పుడైనా ఓ ఓ


ఎవ్వరు ఎదురుగ వస్తున్న నువ్వేమో అనుకుంటున్నా
నీ రూపం నా చూపులనొదిలేన ఓ ఓ


ఎందరితో కలిసున్నా నెనొంటరిగానే ఉన్నా నువ్వొదిలిన ఈ ఏకాంతంలోన ఓ ఓ ఓ


కన్నులు తెరిచే ఉన్నా నువ్వు నిన్నటి కలవే ఐనా
ఇప్పటికి ఆ కలలొనే ఉన్నా.....


నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇప్పుడైనా ఓ ఓ




చరణం-1

ఈ జన్మంతా విడిపోదీ జంట అని దీవించిన గుడిగంటను ఇక నా మది వింటుందా!!!


నా వెను వెంట నువ్వే లేకుండ రోజు చూసిన ఏ చోటైనా నను గుర్తిస్తుందా!!!


నిలువున నను తడిమి అలా వెనుదిరిగిన చెలిమి అలా
తడి కనులతో నిను వెతికేది ఎలా


నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇప్పుడైనా ఓ ఓ





చరణం-2

నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో కొన్నాళ్ళైనా సంతోషంగా గడిచాయనుకోనా


నా ఊహల్లో కలిగే వేదనలో ఎన్నాళ్ళైనా ఈ నడిరాతిరి గడవదు అనుకోనా


చిరునవ్వుల పరిచయమా సిరి మల్లెల పరిమళమా
చేజారిన ఆశల తొలి వరమా ఆ


నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇప్పుడైనా ఓ ఓ


ఎవ్వరు ఎదురుగ వస్తున్న నువ్వేమో అనుకుంటున్నా
నీ రూపం నా చూపులనొదిలేన ఓ ఓ



Comments

Popular posts from this blog

తెలుగు సామెతలు

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక అద్భుతమైన లేఖ ఇది.

12-February-1995