ఐ లవ్ యూ అమ్మా

నువ్వు   పోసిన   లాల...  నువ్వు   ఊపిన   ఉయ్యాల.

నువ్వు   కలిపిన   ముద్ద...   నువ్వు   పెట్టిన  ముద్దు.

నువ్వు  చెప్పిన  కథ...  నువ్వు  పాడిన  పాట.

నువ్వు  నేర్పిన  నడక...  నువ్వు  వేసిన  పిలక.

నువ్వు  వేసే అట్లు...  నువ్వు  తిట్టే  తిట్లు.

నువ్వు   వేసిన  లెంప కాయ...  నువ్వు   కొట్టిన  ముట్టికాయ.

అన్నీ మధురమే...

అందుకే
ఐ లవ్ యూ
ఐ లవ్ యూ
ఐ లవ్ యూ  అమ్మా!


నీ  వడిలో  పడుకుని
నీ వేలు  పెట్టుకుని
ఆడిన ఆటలన్నీ మధురమే.

నిన్నే అంటి పట్టుకుని
నీ భుజమున తల వాల్చి
తీసిన కునుకులన్నీ మధురమే.

నీ ఊయల ఊపులకై
నేనేడ్చిన దొంగ ఏడుపులన్నీ మధురమే.

నువ్వు లాల పోస్తుంటే...
నేనే పోసుకుంటానని చేసిన అల్లరి అంతా మధురమే.

నేనే అలిగితే
బుంగ మూతి పెట్టి కూర్చుంటే
నువ్వు చేసిన బుజ్జగింపులే మధురమే.

కంటి వంటి నా ప్రాణానికి
కనుపాపే నీ ప్రేమ అమ్మా!

కాళ్లతో తన్నినా మురిసిపోయే పిచ్చి ప్రేమ నీదే అమ్మా!

అందుకే
ఐ లవ్ యూ
ఐ లవ్ యూ
ఐ లవ్ యూ  అమ్మా!



నీ భుజంపై తల వాల్చి నే చూసిన లోకమే అందమైనదమ్మ...
నీ చెయ్యే పట్టుకుని నే నడిచిన దారే మరిచిపోనిదమ్మా...
నీ పేగు తెంచుకుని నాకిచ్చిన ప్రాణానికి ఋణపడి ఉంటాను అమ్మా...
నీ రక్తాన్నే పాలుగా మలిచి నాకిచ్చిన అమృతానికి విలువ కట్టలేనమ్మా...
జో కొడుతూ నువ్వు చెప్పిన కధలే జీవిత పాtaలు కదమ్మా...
నువ్వు నేర్పిన రాతే మార్కులు తెస్తాయి
నువ్వు నేర్పిన పలుకులే ఉద్యోగం ప్రసాదిస్తాయ్
జీవితంలో  ప్రతీ రోజు నువ్వు  నేర్పిన ఒక్క పనైనా నిన్ను  గుర్తుతెస్తూ బ్రతికినంతకాలం తీర్చుకోలేని ఋణంగా మిగిలిపోతాం.
రోజు పూజ చేసినంత మాత్రాన కష్టం వస్తే దేవుడు రాడు, పిలవకపోయినా నువ్వు పరిగెత్తుకుని వస్తావ్.


అందుకే
ఐ లవ్ యూ
ఐ లవ్ యూ
ఐ లవ్ యూ  అమ్మా!














Comments

Popular posts from this blog

తెలుగు సామెతలు

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక అద్భుతమైన లేఖ ఇది.

12-February-1995