నువ్వొస్తానంటే నేనొద్దంటాన

రణం



ఆకాశం తాకేలా వడ గాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటేఆరాటం తీరేలా బదులిచ్చే గగనం లా వినిపించే తడి గానం ప్రేమంటేఅణువణువును మీటే మమతల మౌనం పద పద మంటే నిలవదు ప్రాణంఆ పలుకే ప్రణయానికి శ్రీకారందాహం లో మునిగిన చిగురుకు చల్లని తన చెయందించీస్నేహం తో మొలకెత్తించే చినుకే ప్రేమంటేమేఘం లో నిద్దుర పోఇన రంగులు అన్ని రప్పించిమాఘాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే

పల్లవి-1



ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేది ఏదో గుర్తించేందుకు వీలుందాప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదఇస్తుందో గమనించే సమయం ఉంటుందాప్రేమంటే ఎమంటే చెప్పేసే మాటుంటే ఆ మాట కి తెలిసేనా ప్రేమంటేఅది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావంసరిగమలెరుగని మధురిమ ప్రేమంటేదరిదాటి వురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ వొరవడి పెంచిన తొలి చినుకేదంటేసిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే


పల్లవి-2



మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటేపండే పొలము చెపుతుందే పదునుగా నాటే నాగలి పొటే చేసిన మేలంటేతనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిచేరే ప్రియురాలే గెలుపంటేతను కొలువైవుండే విలువే వుంటే అలాంటి మనసుకు తనంతా తానై అడగకదొరికే వరమే వలపంటేజన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత వుంటే నడకల్లో తడబాటైనా నాట్యం ఐపోదారేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు వుంటే ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా

Comments

Popular posts from this blog

తెలుగు సామెతలు

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక అద్భుతమైన లేఖ ఇది.

12-February-1995