డైరీ
నాకు ఊహ తెలిసిన దగ్గరనుంచి నన్ను అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తులు: హారిక భవాని, స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం, రాహుల్ ద్రావిడ్, శ్రీ శ్రీ, వాజపాయి, ధోని, లక్ష్మి భాయి, రాకేశ్ శర్మ, ఎల్ వి ప్రసాద్. నా జీవితంలో నేను ఎల్లప్పుడూ ఋణపడి వుండే వ్యక్తీ: హారిక భవాని . ఎదో సాధించాలనే ఆశ. రాకేశ్ శర్మ గురించి చదివి నేను కూడా వ్యోయగామి అవ్వలనుకున్నాను. దానికి చాలా ఖర్చవుతుందని తెలిసి ఆలోచన మార్చుకున్నాను. రాకెట్ నుంచి కన్ను విమానం పైన పడింది. పైలట్ అయ్యి తీరాలి అనుకున్నాను. కానీ ఎలా అవ్వాలో అప్పటికి నాకు తెలిదు. రోజు పేపర్ చదవడం అలవాటు చేసుకున్నాను. అపుడు నాకు తెలిసింది బాపట్ల దగ్గర సూర్య లంక సమీపంలో ఒక ఎయిర్ ఫోర్సు స్కూల్ వుందని. ఆ స్కూల్లో సీట్ కోసం ప్రయత్నించాను. కానీ అప్పటికే ఆ సంవత్సరం అడ్మిషన్స్ అయిపోయాయి. తరువాతి సంవత్సరం ప్రయత్నించాను. ఎంట్రన్స్ టెస్ట్ రోజు పరీక్షకి ఎవరూ తీసుకెళ్ళలేదు. పైగా అలాంటివి మనకి సరిపోవు అని చిన్న చూపు చూసేవారు. పేపర్ బాగా చదివేవాడిని, చందమామ పుస్తకాలు బాగానే చదివేవాడిని కానీ, పాఠ్య పుస్తకాలంటే మాత్రం ఏకాగ్రత నిలిచేది కాదు. ఒకర...